APTET-2012 RESULTS

APTET JAN-2012 RESULTS : click here
                                            
                                                      TET - IS IT REALLY NEEDED ?
 D.S.C నిర్వహిస్తోన్న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో TET అవసరం ఉందా ? అభ్యర్దులారా ఉద్యమించండి . TET రద్దు కై పోరాడండి .
NATIONAL COUNCIL FOR TEACHER EDUCATION (NCTE), NEW DELHI వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మన దేశం లో అన్ని రాష్ట్రాలు B.Ed, D.Ed. colleges maintain చెయ్యటం ,వాటి quality చూడటం ,పర్యవేక్షణ చేయటం జరగాలి .అన్ని వసతులు ఉన్నాయా  లేదా , qualified lecturers వున్నారా లేదా అనే విషయాలు మన education department ,SCERT,HYD చూసుకోవాలి .వీళ్ళకి NCTE కాలానుగుణంగా rules & regulations పంపిస్తుంది .అలాగే ఈ కాలేజి లను inspection చేస్తుంది .దీనివల్ల భావి తరాలను తీర్చిదిద్దే మంచి ఉపాధ్యాయులు శిక్షణ పొంది  మంచి సమాజాన్ని తయారు చేస్తారని NCTE ,SCERT ల లక్ష్యం .
మన రాష్ట్రం లో PRIMARY SCHOOL  ఉపాధ్యాయుడు గా తయారవ్వాలంటే INTER తర్వాత D.Ed entrance test లో సెలెక్ట్ అవ్వాలి .రెండు సంవత్సరాల శిక్షణ తర్వాత ,అందులో అంతిమ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి .అదే HIGH SCHOOL లో టీచర్ కావాలంటే ,డిగ్రీ అనంతరం EdCET లో మంచి ర్యాంకు తెచ్చుకుని ,నిర్దేశిత శిక్షణా కాలం తర్వాత ,అందులో అంతిమ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి . తర్వాత TEACHER ELIGIBILITY TEST లో  ఉత్తీర్ణులు అవ్వాలి. తర్వాత జిల్లా ఎంపిక కమిటీ (D.S.C) నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉన్నతమైన మార్కులు సాధించి ,ఉన్న కొద్ది ఉద్యోగాలలో విపరీతమైన పోటీని తట్టుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు గా ఉద్యోగం చేపట్టాలి .

ఇన్ని రకాల పరీక్షలు ,శిక్షణల తర్వాత మళ్ళీ ఉపాధ్యాయుల కు TEACHER ELIGIBILITY TEST పేరుతో వేరొక పరీక్ష నిర్వహించడం లో NCTE ,SCERT ల ఉద్దేశ్యం , మంచి జ్ఞానవంతులైన వారిని schools లో నియమించాలనే . ఐతే , ఉపాధ్యాయ శిక్షణ పొందినవారికి మరల అర్హత పరీక్ష ఎందుకు అనే ప్రశ్న కు NCTE, SCERT చెప్తున్న సమాధానం  "శిక్షణా కళాశాలలో  శిక్షణ సరిగా వుండటం లేదు , ఎప్పుడో శిక్షణ పొందిన వారిలో కొన్నేళ్ళ తర్వాత జ్ఞానం తగ్గిపోతుంది. కాబట్టి అర్హత పరీక్ష అవసరం  "  అని .

మరి ఈ T.E.T లో అర్హత పొందాలంటే , SC,ST,వికలాంగులకు 40% , BC లకు   50%  , GENERAL అభ్యర్ధులకు  60% మార్కులు తో TET  ఉత్తీర్ణులు అవ్వాలి . ఇలా వచ్చిన వారే D.S.C పరీక్షకు ,అనగా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి APPLICATION పెట్టుకోవడానికి అర్హులు . అర్హత పరీక్ష మార్కుల లో  కూడా రిజర్వేషన్ పెట్టడం వలన సదరు వర్గాలవారిని అవమానించడమే . అంటే సదరు వర్గాల వారు తక్కువ జ్ఞానవంతులు , వారు అంతకంటే మార్కులు సంపాదించలేరు అని తీర్మానించి అవమాన పరచడమే . ఎలాగూ TET లో అత్యధిక మార్కులు వచ్చిన వార్కి D.S.C లో 20% వెయిటేజీ ఇస్తామని ప్రకటించి, ఉత్తర్వులు ఇచ్చినపుడు , మరి అర్హత పరీక్షలో ఇన్ని రకాల qualifying marks పెట్టడం ఎందుకు ? అన్ని వర్గాల వారికి కనీస ఉత్తీర్ణతా శాతం గా 40% నిర్ణయించి , DSC లో పాల్గొనేందుకు అందరికీ సమాన అవకాశం కల్పించి అందరి హక్కులను కాపాడవచ్చు కదా ! ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలలో ఎలాగూ రిజర్వేషను పాటిస్తున్నపుడు , DSC  ఎంపిక పరీక్ష మార్కులకే రిజర్వేషను లేనపుడు , కేవలం అర్హత పరీక్షలో మూడు రకాల QUALIFYING MARKS ను నిర్ణయించి ఔత్సాహికుల లో మనో వేదన కల్గించడం ఎందుకు ? ఒక అభ్యర్ధి TET ఉత్తీర్ణుడు కావటానికే అనేకసార్లు వ్రాయవలసి వుంటే , ఇక DSC ఎప్పుడు వ్రాస్తాడు , అతని గరిష్ట ఉద్యోగ అర్హత వయస్సుమీరే లోగా ఎన్ని DSC లను ప్రభుత్వం ప్రకటించగలదుకుటుంబాన్ని ఆదుకోవాలనుకునే పురుష / స్త్రీ అభ్యర్ధులపై ఎంత వత్తిడి వుంటుందో నిబంధనలు తయారు చేసే అధికారులు ఆలోచించలేరా ?

అంతేకాక , HIGH SCHOOLS లో SCIENCE బోధించాలనుకునే ఉపాధ్యాయ అభ్యర్ధులు గణితం లో కూడా TET లో ఉత్తీర్ణులు అవ్వాలని ప్రశ్నలు ఇవ్వటం ఏ మేరకు సమంజసం ? ఎప్పుడో 10 వ తరగతిలో వదిలేసిన గణితం పై ప్రశ్నలు ఇవ్వడం ఏమాత్రం  న్యాయం ? .

NCTE, SCERT పర్యవేక్షణలో వుండే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల ను పటిష్టపరచకుండా , ఇబ్బడి ముబ్బడి గా అనుమతులిచ్చేసి , నాణ్యతను పట్టించుకోకుండా గాలికి వదిలేసి , అభ్యర్ధుల పై వత్తిడి పెంచేసి , వివిధ వర్గాల మనోభావాలను గాయపరిచే విధంగా  TET అర్హతా మార్కులను నిర్ణయించడం వల్ల సదరు NCTE, SCERT కోరుకునే జ్ఞానవంతులైన ఉపాధ్యాయులు వస్తున్నారా ? విద్యార్ధులకు బోధించే ఉపాధ్యాయుడు జ్ఞానవంతుడు అయి వుండాలి గాని , ఆ   జ్ఞానం కూడా 40% / 50% / 60% అయితే చాలనుకుంటే , మరి ఈ అర్హత పరీక్ష (TET)ఎందుకు ?