MODEL SCHOOLS

website for RVM : CLICK HERE
check the information for MODEL SCHOOLS  :  HERE     and also : HERE

.METHOD OF APPOINTMENT  AND INFORMATION BULLETIN : CLICK HERE
Sl. No   Posts        Scale of Pay                  Method of Recruitment
1         Principal    Rs.20680-46960/-         Direct Recruitment
2        PGTs          Rs.16150-42590/-        Direct Recruitment
3        TGTs         Rs.14860-39540/-          Direct Recruitment


మోడల్ స్కూల్స్ లో విద్యార్ధుల ప్రవేశాలు - అసంబద్ధ విధానం మార్చాలి 
మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ పరిశీలిస్తే , కేవలం టీచర్ల కే మోడల్ నిర్ణయించినట్లుంది ప్రభుత్వం . టీచర్లు గా నియమింప బడే వారికి ఆంగ్ల మాధ్యమ విద్య ఉండాలన్న ప్రభుత్వం , విద్యార్ధుల ప్రవేశం విషయానికొచ్చేసరికి " లాటరీ పద్ధతిలో ప్రవేశం " అనడం అసంబద్ధం .
ఎందుకంటే , మోడల్ స్కూల్ లో విద్య ఆంగ్ల మాధ్యమం లో వుంటుంది .  6 వ తరగతిలో  ప్రవేశానికి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు & ఆంగ్ల మాధ్యమాలలో చదివిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటారు. లాటరీ లో తెలుగు మాధ్యమం లో చదివి ఉన్న విద్యార్ధి ఎంపికై , ఆంగ్ల మాధ్యమ విద్యార్ధి ఎంపిక కాకపోతే పరిస్థితి ఏమిటి ?

అసలు బోధించే ఉపాధ్యాయులకే ఆంగ్ల మాధ్యమ విద్య అవసరం అన్న ప్రభుత్వానికి , ప్రాధమిక విద్య ఆంగ్ల మాధ్యమం  కలిగిన విద్యార్ధులు  అవసరం లేదా ? మరి మోడల్ స్కూల్ లక్ష్యం ఎలా నెరవేరుతుంది ? మనముందు ఇప్పటికే సక్సస్ స్కూల్ అనుభవాలు వున్నాయి . ఇక్కడ ఆంగ్ల మాధ్యమం జాయినైన (1  నుండి 5  తెలుగు మీడియం లో చదివిన )విద్యార్ధులు ఎక్కువ శాతం  , ఇప్పుడు చదవలేక , తెలుగు మీడియం లోకి మారలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు .వీరికి బోధించలేక టీచర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు .
పోనీ అందరికి సమాన అవకాశాలు ఇచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి వున్నప్పుడు , నవోదయ ,కేంద్రీయ విద్యాలయాల వలె ప్రవేశ పరీక్ష నిర్వహించి యోగ్యులైన విద్యార్ధులకు ప్రవేశం కల్పిస్తే , అటు విద్యార్ధులకు ,ఇటు టీచర్లకు సౌలభ్యం గా వుంటుంది . మోడల్ స్కూల్ లక్ష్యం నెరవేరుతుంది .

కాబట్టి ఈ విషయం లో ఉపాద్యాయ సంఘాలు , తల్లితండ్రులు , అధికారులు ఆలోచించి ప్రభుత్వానికి సరి అయిన దిశా నిర్దేశం చేయగలరని కోరుతున్నాం .